– మయన్మార్-థాయి సరిహద్దుల్లో ముగ్గురు వ్యక్తులు
– వ్యవహారాన్ని విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అసద్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి24: విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి, హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు థాయ్‌ల్యాండ్-మయన్మార్ సరిహద్దులో చిక్కుకుపోయారు. యువకుల్లో ఒకరు ఉస్మాన్‌నగర్‌కు చెందిన వారు కాగా మరో ఇద్దరు మౌలాలీ, బంజారాహిల్స్‌లకు చెందిన వారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని నమ్మించిన సైబర్ ముఠా వీరిని 15 రోజుల క్రితం థాయ్‌లాండ్‌కు రప్పించుకుంది. అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా మయన్మార్ సరిహద్దుల్లోని నిర్బంధ శిబిరాల్లో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇదే విషయాన్ని బాధితులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితుల్లో ఓ యువకుని తల్లి రెండు రోజుల క్రితం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిసి తన కుమారుడిని రక్షించాలని వేడుకుంది. దీనిపై స్పందించిన ఆయన విషయాన్ని విదేశాంగ మంత్రి జయశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌తోపాటు దక్షిణ భారత దేశం నుంచి మొత్తం 16మంది ఇలాగే సైబర్ మోసగాళ్లు చేతిలో మోసపోయి అక్కడే చిక్కుకున్నారని, వారందరనీ సురక్షితంగా రప్పించాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.