– కృష్ణకాంత్ పార్కులో మంత్రి సీతక్క ప్రచారం
– నవీన్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: పిల్లల ఎదుగుదలలో తల్లి పడే తపన, తండ్రి పడే కష్టం ఎంత ఉంటుందో హైదరాబాద్ ఎదుగుదలలో కాంగ్రెస్ కష్టం అంతే ఉందని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్నొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆమె కృష్ణ కాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ప్రచారం చేశారు. హైదరాబాదులో వందలాది ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధంగా వేలాది కంపెనీలు, లక్షలాది ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ కృషి ఫలితమేనన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను నెహ్రూ, ఇందిరా గాంధీ ఏర్పాటు చేశారని, హైదరాబాద్ అభివృద్దిని.. హస్తాన్ని వేరు చూసి చూడలేమని ఆమె చెప్పారు. అనంతరం స్థానిక వీధి వ్యాపారులను ఆప్యాయంగా పలకరించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వీధి వ్యాపారులు, వాకర్స్ విజ్ఞప్తి మేరకు మంత్రి సీతక్క సరదాగా కాసేపు టీ, పూలు విక్రయించారు. హస్తంతోనే హైదరాబాద్ అభివృద్ది చెందింది.. చెందనుంది అని ఓటర్లకు హామీ ఇచ్చారు. మంత్రి సింప్లిసిటికీ ఫిదా అయినా ఓటర్లు సీతక్క విజ్ఞప్తి మేరకు నవీన్ యాదవ్‌కు ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తామని స్పష్టం చేశారు. సీతక్కకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క వెంట ఎమ్మెల్యే నాగరాజు, పార్టీ స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


