– తెలంగాణ మీడియా అకాడమీ, ఐజేఎంల ఆధ్వర్యంలో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్ అంశాలపై తెలంగాణ మీడియా అకాడమీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) సంయుక్తంగా ఈనెల 16న ఉదయం 10 గంటలకు మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ నేరాల తీవ్రతను అర్థం చేసుకుని అవగాహన పెంపొందించేలా, బాధితుల పట్ల ప్రదర్శించాల్సిన వైఖరి లక్ష్యంతో మీడియా ప్రతినిధుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ వర్క్‌షాప్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బాండెడ్ లేబర్ బాధితుల పునరావాసం, న్యాయపరమైన, సమాజపరమైన మద్దతు అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారు. అలాగే మీడియా పాత్ర, బాధితుల గౌరవాన్ని కాపాడుతూ సమగ్ర కథనాల తయారీపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. సివిల్ సొసైటీ ప్రతినిధులు, న్యాయ నిపుణులు, అనుభవజ్ఞులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకుంటారు. పాల్గొనదలచిన మీడియా ప్రతినిధులు 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ పేరు, సంస్థ పేరు, హోదా, పనిచేస్తున్న ప్రదేశంతోపాటు తమ మొబైల్ నెంబర్‌ను ఈ కార్యాలయ మేనేజర్ సెల్ నెంబర్ 7093600977కు వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మీడివయా అకాడమీ కోరుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





