భద్రాద్రి, యాదాద్రి, ధర్మపురికి పోటెత్తిన భక్తులు

– ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు
– తెల్లవారుజామునుంచే కిక్కిరిసిన ఆలయాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 30 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు వైష్ణాలయాలు కిక్కిరిపోయాయి. ఉత్తర ద్వార దర్శనాల కోసం భక్తులు తెల్లవారుజామునే దేవాలయాలకు చేరుకున్నారు. యాద్రాద్రి, భద్రాచలం, ధర్మపురి, చిలుకూరు బాలాజీ సహా పలు పుణ్యక్షేత్రాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భద్రాచలం రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై శ్రీ రాముడు, గజ వాహనంపై సీతమ్మ, హనుమద వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్త జనం తరలి వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే లోని గోదావరిలో వేకువజామునే స్నానమాచరించిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్‌లో టీటీడీ ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలిచ్చారు. హిమాయత్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌ వేంకటేశ్వరాలయాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. వనపర్తి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా వేంకటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యంగా వరంగల్‌ బట్టల బజార్‌, వంద ఫీట్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ధర్మసాగర్‌ మండలం చిల్పూర్‌ బుగులు వేంకటేశ్వరస్వామి, నర్సింహులపేట వేంకటేశ్వరస్వామి ఆలయాలు సహా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *