ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

– కార్యక్రమంలో పాల్గొన్న‌ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భిక్కనూర్ లక్ష్మి, చిట్యాల రాజమణిలకు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులకు నిత్యావసర సరకులు, వస్త్రాలు అందజేశారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో ఫోన్ ద్వారా మాట్లాడించగా లబ్ధిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూలిపోయిన ఇళ్లను చూసి చలించిపోయి అధికారంలోకి రాగానే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృVŸ ²ప్రవేశం చేయించడం ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సర్పంచ్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, మార్కెట్ కమిటీ చైౖర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *