హిట్‌ అం‌డ్‌ ‌రన్‌ ‌కేసులో బెయిల్‌ ‌నిరాకరణ

– ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాల్సిందే
– ముంబై కేసులో సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

న్యూదిల్లీ,డిసెంబరు 13 (ఆర్‌ఎన్‌ఎ): ‌ముంబయిలో గతేడాది చోటుచేసుకున్న హిట్‌-అం‌డ్‌-‌రన్‌ ‌కేసు లో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. నిందితుడు మిహిర్‌ ‌షా వేసిన పిటిషన్‌పై దర్యాప్తునకు నిరాకరించింది. ఇలాంటి అబ్బాయిలకు తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనని వ్యాఖ్యానించింది. హిట్‌-అం‌డ్‌-‌రన్‌ ‌కేసులో బైక్‌పై వస్తోన్న వారిని అతివేగంగా తన కారుతో ఢీకొట్టడమే కాకుండా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా, జస్టిస్‌ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చేసిన నేరానికి గానూ అతడు కొద్ది రోజుల పాటు జైల్లోనే ఉండాలని ఆదేశించింది. గతేడాది ముంబయిలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేశ్‌ ‌షా కుమారుడు మిహిర్‌ ‌షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించగా.. ఆమె భర్త గాయపడ్డారు. అయితే, ప్రమాదం తర్వాత మిహిర్‌ ‌ఘటనకు కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని మిహిర్‌ ‌ముంబయి హైకోర్టులో పిటిషన్‌ ‌వేయగా న్యాయస్థానం నిరాకరించింది. దీంతో అతడు సుప్రీంను ఆశ్రయించాడు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *