జీహెచ్‌ఎం‌సీ వార్డుల విభజనపై హైకోర్టు కీలక తీర్పు

– డీలిమిటేష వ్య‌తిరేక పిటిషన్లు కొట్టివేత
– 300 డివిజన్లకు లైన్ క్లియర్!
– ప్రభుత్వానికి ఊరట

హైదరాబాద్, డిసెంబర్ 22(ఆర్‌ఎన్‌ఎ): జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల విభజన ప్రక్రియపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. వార్డుల పునర్విభజన, డివిజన్ల సంఖ్య పెంపు అంశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గ్రేటర్ హైదరాబాద్ లో త్వరలో జరగనున్న ఎన్నికలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరే షన్లను ప్రభుత్వం గతంలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ఈ విలీనానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల సంఖ్యను 300కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విభజన శాస్త్రీయంగా జరగలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వార్డులను మార్చారని ఆరోపిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఏమందంటే?

ఈ పిటిష న్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. వార్డుల విభజన అనేది ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రభుత్వం అనుసరించిన నిబంధనల్లో రాజ్యాంగ ఉల్లంఘన లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. తదుపరి అడుగు ఫైనల్ నోటిఫికేష కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వార్డుల విభజనపై ప్రభుత్వం నేడో రేపో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *