కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన హై కోర్ట్ 

ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ    కేసులో  తనను అరెస్ట్ చేయొద్దంటూ మాజీ మంత్రి ,బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే కె టి రామ రావు చేసిన అభ్యర్థనను హై కోర్ట్  తిరస్కరించింది. కేటీఆర్ , ఏసీబీ ల వాదనలు విన్న హై కోర్ట్ ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకుని ..ఇటువంటి కేసులలో క్వాష్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవడం జరగదని గతం లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది. ఇదే అంశం పై కేటీఆర్ సుప్రీమ్ కోర్టు ను ఆశ్రయించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నెల 9 న విచారణకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ కేటీఆర్ కు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *