గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలు వారికి చెంపపెట్టు

– కాంగ్రెస్‌ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. గాంధీ భవన్‌లో పార్టీ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌ చైర్మన్‌ సామా రామ్మోహన్‌ రెడ్డి బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న వాళ్లకి కోర్టు ఆదేశాలు చెంపపెట్టు అని అభివర్ణించారు. గ్రూప్‌-1 ర్యాంకర్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాక ఈ పరీక్షలను రద్దు చేయడం ద్వారా ర్యాంకర్ల తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురిచేశారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వొచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్క గ్రూప్‌-1 పోస్టు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉద్యోగాలు రాకుండా అడ్డుకుని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. అలాంటి వేళ కోర్టు ఆదేశాలతో న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *