– బాంబుల కలకలం
– అప్రమత్తమైన పోలీసులు, అధికారులు
– ఆలయాలు, బస్టాండ్ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు
తిరుపతి, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని హిందూ దేవాలయాల్లో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుండి అధికారులకు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో కంగారుపడిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్న ఆలయాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్‌తోపాటు జాగిలాలు, ఇతర బాంబు నిర్వీర్య విభాగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించడంలేదు. తిరుపతిలో కపిలతీర్ధ ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయాలతోపాటు శ్రీనివాసం, విష్ణునివాసం, స్థానిక బస్టాండ్‌లో బాంబులు పెట్టినట్లు దుండగులు బెదిరించారు. ఈ ప్రాంతాలన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. నిజంగానే బాంబులు పెట్టి వుంటే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశాలుంటాయి. అందుకే అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. నఅతీంశీ ఎలాంటి బాంబులను గుర్తించలేదని పోలీసులు చెప్పారు. ఈ-మెయిల్‌లో పేర్కొన్న ఆలయాలతో పాటు మరికొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా తిరుపతిలో జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణంలోనూ తనిఖీలు చేపట్టారు. దీంతో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిరది.
సీఎం పర్యటన వేళ బాంబుల కలకలం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 6న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సమయంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సీఎం హెలిక్యాప్టర్ ల్యాండిరగ్ కోసం ఇప్పటికే అగ్రికల్చర్ కాలేజి ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోని భద్రతా సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. అనుమానాస్పద వస్తువులు, మనుషులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించాలని తిరుపతి పోలీసులు ప్రజలకు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





