మరో మూడ్రోజులు భారీ వర్షాలు

– వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు15 : తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం సిద్దిపేట, రంగారాఎడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌నిర్మల్‌, ‌కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌వరంగల్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట గ్రామంలో 24.5 సెంటీ టర్ల వర్షపాతం నమోదైంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *