– వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29:మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్‌లోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, లక్ష్మీగణపతి, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్‌రోడ్, బట్టల బజార్‌లో రోడ్లపైకి వరదనీరు చేరింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు బారీగా నిలిచింది. శివనగర్‌లో రహదారిపై వరద నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వరంగల్ బస్టాండ్ చెరువును తలపిస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా హనుకొండ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 79819 75495 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. వరంగల్ జిల్లా క్లలెడలో అత్యధికంగా 34 సెం. వర్షపాతం నమోదైంది. హనుమకొండ, వరంగల్, మహబూబ్ బాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఖమ్మం- మహబూబాబాద్ జిల్లాల మధ్య నిలిచిన రాకపోకలు. ఖమ్మం- మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్యాతండా సపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో ఇవాళ సాయంత్రం నుంచి రెండు జిల్లాల మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ’మొంథా’ తుపాను వాయుగుండంగా బలహీనపడింది. గడచిన 6 గంటలుగా ఇది 12 కి.మీ వేగంతో కదులుతోంది. తెలంగాణ భూభాగంపై దీని ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మం జిల్లాకు 110 కి.మీదూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఒడిశాలోని మల్కన్‌గిరికి 130 కి.మీ దూరంలో ఉంది. ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడనుంది. దీని కారణంగా రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో ఒకట్రెండు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. పలు ప్రాంతాల్లో 35-45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు
హైదరాబాద్: తీరం దాటిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీర ప్రాంతాల జిల్లాలో విధ్వంసం సృష్టించిన మొంథా.. మిగతా జిల్లాల్లోనూ తీవ్ర పంట నష్టాన్ని మిగిల్చింది.. ఇక, తుఫాన్ ప్రభావంతో.. ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పెద్ద సంఖ్యలో రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి.. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. కోస్తా ప్రాంతాలు.. విజయవాడ దుగా నడవాల్సిన చాలా రైళ్లను రద్దు చేశారు.. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాని రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





