– పోలీసుల వద్ద ఉన్నారనే ఆధారాలు లేవు : హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, నవంబర్ 21(ఆర్‌ఎన్‌ఎ): మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు దేవ్ జీ, రాజిరెడ్డి… పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని.. వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. పోలీసుల వద్ద ఆ ఇద్దరు అగ్రనేతలు ఉన్నారనే దానిపై ఆధారాలు లభిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. ఆపై మావోయిస్ట్ నేతల బంధువులు వేసిన పిటిషన్‌పై విచారణను ధర్మాసనం మూసివేసింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ రాజారెడ్డి కుమార్తె స్నేహలత, దేవ్ జీ సోదరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్‌స్టేట్‌మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలుపగా.. ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నేటి విచారణలో పోలీసుల ప్రెస్ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన వీడియోను పిటిషనర్ల తరుఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. వీడియోను చూసిన ధర్మాసనం.. సెక్యూరిటీ సిబ్బంది తమ అదుపులో ఉన్నారని పోలీసులు చెప్పినట్లు గుర్తించింది. దేవ్ జీ గురించి డియా ప్రతినిధులు అడగ్గా.. తమ ఆధీనంలో లేరని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లు వీడియోలో ఉందని న్యాయస్థానం గుర్తించింది. దీంతో దేవ్ జీ, రాజిరెడ్డిలు పోలీసుల నిర్భంధంలో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లేవని ధర్మాసనం నిర్దారించింది. ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను క్లోజ్ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





