– జూబ్లీహిల్స్‌లో బోగస్ వోట్లపై విచారణ
హైదరాబాద్,అక్టోబరు16(ఆర్‌ఎన్): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ వోట్లపై మాజీ మంత్రి కేటీఆర్, జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషన్లపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్స్‌ను ఈసీ రివిజన్ చేస్తోందని.. ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది హైకోర్టు. వోటో చోరీపై హైకోర్టులో బీఆర్‌ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌తో సంబంధంలేని వారు వోటరు జాబితాలో చేరారని తెలిపారు. బోగస్ వోట్లపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించామని వాదనలు వినిపించారు. ఈసీ తరపు లాయర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ రిప్రజెంటేషన్‌లపై ఎన్నికల అధికారిని ఆదేశించామని.. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్ట్ ధర్మాసనం బోగస్ వోట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





