గురువారం మిట్ట మధ్యాహ్నం, కడుపు నిండుగా మనుషుల్నీ, వాళ్ల జీవితాలనీ కలల్నీ కర్తవ్యాలనీ మోసుకుని ఎగరబోయిన లోహవిహంగం, కుప్పకూలిపోయింది. మండిపోయింది. దగ్ధ మాంసశకలాలుగా పిగిలిపోయింది. పైకి ఎగతన్నుకోలేకపోతున్నాను, శక్తి చాలడంలేదు, నేలరాలిపోతున్నాను అన్న సందేశాన్ని వదిలి నిస్సహాయంగా విస్ఫోటించింది. చావుల మీద యుద్ధానికి చదువులు పదునుపెడుతున్న, అన్నం కంచాల ముందు కూర్చున్న, రేపటి డాక్టర్ల మీద మిన్నులా విరిగిపడింది. అమాయకపు నిరీక్షణలమీద క్షిపణి దాడి, తలకొట్టుకుని గుండె బాదుకుని ఎన్నెన్ని ఎడతెగని ఆప్త ఆర్తనాదాలు! ఎందరి కడుపుకోత, ఎన్ని కన్నీళ్ల కుండపోత!!
ఒక ప్రమాదం. ఎక్కడో ఏ కొంచెమో మనుషులదో వ్యవస్థలతో యంత్రాలదో అలక్ష్యమో ఏమరుపాటో ఉండవచ్చు, లేకపోనూ వచ్చు. సంభావ్యతలన్నిటినీ నివారించలేని మానవ అశక్తత ఇంకా మిగిలే ఉండవచ్చు. ఎన్నడూ స్ఫురణకు రాని ‘విధి’ ఉన్నట్టుండి రంగం మీదకు రావచ్చు. అతీతశక్తి ఉన్నదని అనిపించే సమయం ఇదే కావచ్చు. వివరించలేని, అర్థం కాని విషాదం కమ్ముకున్నప్పుడు, మనుషులు బేలలు అవుతారు. ఆ కొద్ది కాలం, మనుషుల మధ్య అగాధాలూ వ్యత్యాసాలూ రద్దయినట్టు కనిపించి మానవీయ సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది.
అందుకే, అహ్మదాబాద్ ప్రమాదం తరువాత ఎట్లా స్పందించాలో మనకు తెలియడం లేదు. కారకులు కనిపించడం లేదు కాబట్టి, ద్వేషం గురిపెట్టడానికీ కుదరడం లేదు. నలభై ఏండ్ల కిందట ‘కనిష్క’ విమానం అట్లాంటిక్ మీద మాయమైనప్పుడు, ప్రాణాలు కోల్పోయినవారి గురించి కాక, వారి కోసం విమానాశ్రయాలలో ఎదురుచూస్తున్న, దుర్ఘటన వార్త తెలిసి తమ వారి క్షేమం కోసం ఆచూకీ కోసం అల్లాడిపోతున్న బంధుమిత్రుల భావోద్వేగాలను ఒక ‘హ్యూమన్ ఇంటరెస్టింగ్’ కథనంగా రాసినట్టు గుర్తు. అప్పటికింకా మానవీయ కథనాలు ఇప్పటి యాంత్రికతను, కృత్రిమతను సంతరించుకోలేదు.
జీవితం బుద్బుదం అని మరోసారి గుర్తుచేసింది ఈ ప్రమాదం అన్నారొక పారిశ్రామిక వేత్త. అస్తిత్వం క్షణికతను చెప్పే సందర్భమే ఇది. అట్లాగని, మనుషులు ఆ ప్రమాదవైరాగ్యంలోనే ఉండిపోరు. దిగ్భ్రాంతి నుంచి, దుఃఖం నుంచి కోలుకోవడానికి ఏదో ఒక ఆలంబన కావాలి. కానీ, ఈ విచార మానవీయఘట్టంలో ఓదార్పునో, సహానుభూతినో అందించగల నైపుణ్యం మీడియాకు, మీడియా ద్వారా ప్రజల భావాలతో సంభాషించే అధికారసమాజానికి తగ్గిపోయింది. కొన్ని గంటలు కూడా ఆ షాక్ లో, విషాదంలో ఉండకముందే, ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందా, పేలుడు జరిగిందా వంటి ప్రశ్నలు మొదలయ్యాయి. స్టోరీలు నడవడానికి ఏదో ఒక ప్రశ్న నడుస్తూ ఉండాలి. సంక్షోభాల కాలం కాబట్టి, కుట్రలను కూడా కొట్టిపారేయకూడదేమో? ఆ సంగతి విచారణలకు వదిలిపెట్టవచ్చు కదా, వెంటనే వాతావరణంలో ఒక విషపుచుక్క వదలడానికి ఎందుకు అంత ఉబలాటం? ఒకే ఒక్కడు, కూలిన ఆ విమానం నుంచి పెద్ద గాయాలు లేకుండా బయటపడడం అద్భుతమని, దైవమహిమ అని ఆధ్యాత్మిక ఆశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. ఆ స్థితి కూడా ఎక్కువకాలం కథనాలు కొనసాగలేదు. ఆ ఒక్కడే కుట్రదారుడేమో? లేకపోతే, ఎట్లా బయటపడ్డాడు? అన్న శంకలు మొదలు. దేవుడా!? ఈ మనిషికి తన విషమనస్కత నుంచి విముక్తి లేదా?
పెహెల్గామ్ హత్యాకాండ జరిగినప్పుడు, ఒక పర్యాటకస్థలంలో, కుటుంబాలతో విహరిద్దామని వచ్చిన సామాన్యులను దుర్మార్గులు పొట్టనబెట్టుకోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. భర్త మృతదేహం వద్ద నిస్సహాయంగా ఉన్న యువతి దృశ్యం ఆ నాటి విషాదానికి ఒక ప్రాతినిధ్య చిత్రంగా దేశప్రజల స్మృతిలో నిలిచిపోయింది. ‘అయ్యో’ అన్న వేదనే తక్షణం దేశప్రజల హృదయంలో కదలాడిన స్పందన. అక్కడి ఘోరకలి సన్నివేశాన్ని వర్ణించినవారు, అక్కడ స్థానికుల మానవీయ స్పందనలను కూడా ప్రపంచానికి చెప్పారు. టెర్రరిస్టు దాడిలో చనిపోయినవారిలో ఒక స్థానిక కశ్మీరీ ఉన్నాడు. అతను హిందువులను రక్షించే క్రమంలో చనిపోయాడు. అక్కడ జరిగింది ఒక మతం వారిపై మరొక మతం వారు చేసిన దాడి అనే కథనాన్ని (దాడి చేసిన వారి లక్ష్యం ఈ నెరేటివ్ ను స్థిరపరచడమే) ఆ కశ్మీరీ తన ప్రాణత్యాగంతో అబద్ధంగా మార్చాడు. ఒక ఘాతుకం గుండెలకు గాయం చేసినప్పుడు, ప్రతికూల భావనలు కమ్ముకునే మనసులకు ఇటువంటి ఆదరణలు, సహాయాల ఉదంతాలు ఉపశమనం ఇస్తాయి. లోకం మరీ అన్యాయంగా లేదని ఊరట కలిగిస్తాయి. కానీ, మన సమాజం ఎక్కువ సేపు విభజనలోకి జారిపోకుండా ఉగ్గబట్టుకోలేదు. కొంచెం సేపైనా , ఒక సహృదయ స్థితిలో ఉండే శక్తిని కోల్పోతున్నది. ప్రతి ఒక ఘట్టమూ, ప్రతి ఒక్క దశా అనివార్యంగా ప్రతికూలమనస్కతలోకి జారిపోవలసిందే!
గాజాలో ప్రతిరోజూ లెక్కబెట్టి వందమందినో యాభైమందినో అందులోనూ తప్పనిసరిగా పదిరవై మంది పసిపిల్లలను పొట్టనబెట్టుకోకుండా తెల్లారని ఇజ్రాయిల్‌కు మనదేశంలో ఎంత మంది అభిమానులో? యుద్ధబాధితులైన పాలస్తీనా బాలబాలికలను చూస్తే గుండెలు పగిలిపోతాయి. పసిపిల్లలే నాకు శత్రువులు అంటాడు నెతన్యాహూ మంత్రి. , ఇరాన్‌లోకి వెళ్లి ‘గుస్ గుస్ కే’ చంపగల వీరుడని మనం వాళ్ళని పొగుడుతాం. ఏడ్చే శక్తి ఎట్లాగూ పోయింది, చలించే శక్తీ పోయింది, మంచీచెడ్డా తెలియని ఒక ఉన్మాద స్థితి మనల్ని క్రమంగా ఆవరిస్తున్నది.
పెహెల్గామ్ కల్లోల కశ్మీర్‌లో జరిగింది కాబట్టి, హంతకులు మతం అడిగి మరీ హిందువులనే చంపారని వార్తలు వచ్చాయి కాబట్టి, దుఃఖంతో పాటు సహజంగా ఆగ్రహాలు కూడా కలిగాయి. టెర్రరిస్టుల మీదనే తమ కోపాన్ని పరిమితం చేసుకున్నవారు కొందరయితే, మొత్తంగా ముస్లిం మైనారిటీల మీద తమ క్రోధాన్ని గురిపెట్టిన వారు మరి కొందరు. హత్యాకాండ జరిగినచోట పర్యాటకులను రక్షించినవారు, గాయపడినవారికి ఆసరాగా నిలిచినవారు కూడా ముస్లిములే అన్న వాస్తవాన్ని చాలా మంది ఖాతరు చేయలేదు. బాధితుల కుటుంబీకులే తాము ఫలానా మతస్థుల మీద కోపంగా లేమని, టెర్రరిస్టులే తమకు హాని చేసినవారని స్వయంగా చెప్పారు. అయినా, దేశంలోని సామాజిక మాధ్యమాలు ద్వేషభాషలో అలరారాయి. చివరకు భర్తను కోల్పోయిన బాధితురాలిని కూడా ట్రోలింగ్ తో వేధించారు. పెహెల్‌గామ్ అనంతర చర్యగా జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతినిధిగా దేశానికి సైనికచర్యల పరిణామాలను వివరించిన వాయుసేన అధికారిణి సోఫియా ఖురేషీ కూడా ద్వేషదాడులను ఎదుర్కొన్నారు. ! పెహెల్గామ్ జరిగిన మరుసటి రోజో, ఆ తరువాతి రోజో, ఒక బెంగాలీ ముస్లిమ్ సైనికుడు కశ్మీర్ లో టెర్రరిస్టులతో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దేశసామరస్య జీవనానికి, సమ్మిశ్రతతకు భరోసా కలిగే అటువంటి వార్తలకు మీడియాలో పెద్దగా చోటు దొరకదు. పాజిటివ్ సంకేతాలంటే మనకు ఎలర్జీ!
పెహెల్గామ్ హత్యాకాండ జరిగినప్పుడు, ఒక పర్యాటకస్థలంలో, కుటుంబాలతో విహరిద్దామని వచ్చిన సామాన్యులను దుర్మార్గులు పొట్టనబెట్టుకోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. భర్త మృతదేహం వద్ద నిస్సహాయంగా ఉన్న యువతి దృశ్యం ఆ నాటి విషాదానికి ఒక ప్రాతినిధ్య చిత్రంగా దేశప్రజల స్మృతిలో నిలిచిపోయింది. ‘అయ్యో’ అన్న వేదనే తక్షణం దేశప్రజల హృదయంలో కదలాడిన స్పందన. అక్కడి ఘోరకలి సన్నివేశాన్ని వర్ణించినవారు, అక్కడ స్థానికుల మానవీయ స్పందనలను కూడా ప్రపంచానికి చెప్పారు. టెర్రరిస్టు దాడిలో చనిపోయినవారిలో ఒక స్థానిక కశ్మీరీ ఉన్నాడు. అతను హిందువులను రక్షించే క్రమంలో చనిపోయాడు. అక్కడ జరిగింది ఒక మతం వారిపై మరొక మతం వారు చేసిన దాడి అనే కథనాన్ని (దాడి చేసిన వారి లక్ష్యం ఈ నెరేటివ్ ను స్థిరపరచడమే) ఆ కశ్మీరీ తన ప్రాణత్యాగంతో అబద్ధంగా మార్చాడు. ఒక ఘాతుకం గుండెలకు గాయం చేసినప్పుడు, ప్రతికూల భావనలు కమ్ముకునే మనసులకు ఇటువంటి ఆదరణలు, సహాయాల ఉదంతాలు ఉపశమనం ఇస్తాయి. లోకం మరీ అన్యాయంగా లేదని ఊరట కలిగిస్తాయి. కానీ, మన సమాజం ఎక్కువ సేపు విభజనలోకి జారిపోకుండా ఉగ్గబట్టుకోలేదు. కొంచెం సేపైనా , ఒక సహృదయ స్థితిలో ఉండే శక్తిని కోల్పోతున్నది. ప్రతి ఒక ఘట్టమూ, ప్రతి ఒక్క దశా అనివార్యంగా ప్రతికూలమనస్కతలోకి జారిపోవలసిందే!
సహృదయ స్పందనలను క్షీణింపజేసే, నిరుత్సాహపరచే వాతావరణం కమ్ముకున్న సమాజంలో, మనలో కన్నీటి గ్రంథులు అడుగంటిపోతాయి. ఆనందించవలసిన వాటికి ఆనందించలేము. ఎవరో మన భావోద్వేగాలను నియంత్రిస్తున్నట్టు, మూసపోసిన ఆనందాలను, దుఃఖాలను మాత్రమే వ్యక్తంచేయగలుగుతాము.ఆపరేషన్ కగార్ విషయంలో అత్యధికంగా వ్యక్తమవుతున్న స్పందన -నిర్లిప్తత. ఆ తరువాతి స్పందన- మౌనాంగీకారం. ఆ తరువాతి స్థానాలలో వ్యతిరేకత, నిరసన ఉంటాయి. చివరిస్థానంలో అయినా, బలమైన వ్యక్తీకరణగా, ఆపరేషన్ కు సమర్థన కనిపిస్తోంది. భారతదేశంలో, సాంప్రదాయికంగాను, రాజ్యాంగపరంగానూ గొప్ప స్థానం ఉందని భావించే ఆదివాసులు పెద్దసంఖ్యలో చనిపోతుంటే, పాలిథిన్ కవర్లలో కళేబరాలు ‘నాగరక’ సమాజాన్ని ప్రతిపూటా పలకరిస్తుంటే, అదంతా పెద్ద విషయం కాదనీ, అనివార్యమనీ, ప్రభుత్వం మంచిపనే చేస్తున్నదని ఎట్లా అనుకోగలుగుతున్నారు? ఆరు నెలల్లో అయిదువందల మంది కదా? పోనీ, అందులో ఒక వందమంది మావోయిస్టులు అనుకున్నా 400 మంది ఆదివాసులే కదా? కాల్పులు నిజమైనవా, బూటకపువా చర్చ కూడా వద్దు, అంతమంది అతిసారతో చనిపోయినా అసెంబ్లీలు పార్లమెంటులు గగ్గోలు పెడతాయి కదా? ఇక్కడెందుకు కళ్లు మూసుకుపోతున్నాయి?
కగార్ వార్తల కింద సోషల్ మీడియాలో కామెంట్లు చూడండి. మనుషులలోని అధోజగత్తు వీరవిహారం కనిపిస్తుంది. గాజాలో ప్రతిరోజూ లెక్కబెట్టి వందమందినో యాభైమందినో అందులోనూ తప్పనిసరిగా పదిరవై మంది పసిపిల్లలను పొట్టనబెట్టుకోకుండా తెల్లారని ఇజ్రాయిల్‌కు మనదేశంలో ఎంత మంది అభిమానులో? యుద్ధబాధితులైన పాలస్తీనా బాలబాలికలను చూస్తే గుండెలు పగిలిపోతాయి. పసిపిల్లలే నాకు శత్రువులు అంటాడు నెతన్యాహూ మంత్రి. , ఇరాన్‌లోకి వెళ్లి ‘గుస్ గుస్ కే’ చంపగల వీరుడని మనం వాళ్ళని పొగుడుతాం. ఏడ్చే శక్తి ఎట్లాగూ పోయింది, చలించే శక్తీ పోయింది, మంచీచెడ్డా తెలియని ఒక ఉన్మాద స్థితి మనల్ని క్రమంగా ఆవరిస్తున్నది.
సహృదయ స్పందనలను క్షీణింపజేసే, నిరుత్సాహపరచే వాతావరణం కమ్ముకున్న సమాజంలో, మనలో కన్నీటి గ్రంథులు అడుగంటిపోతాయి. ఆనందించవలసిన వాటికి ఆనందించలేము. ఎవరో మన భావోద్వేగాలను నియంత్రిస్తున్నట్టు, మూసపోసిన ఆనందాలను, దుఃఖాలను మాత్రమే వ్యక్తంచేయగలుగుతాము.ఆపరేషన్ కగార్ విషయంలో అత్యధికంగా వ్యక్తమవుతున్న స్పందన -నిర్లిప్తత. ఆ తరువాతి స్పందన- మౌనాంగీకారం. ఆ తరువాతి స్థానాలలో వ్యతిరేకత, నిరసన ఉంటాయి. చివరిస్థానంలో అయినా, బలమైన వ్యక్తీకరణగా, ఆపరేషన్ కు సమర్థన కనిపిస్తోంది. భారతదేశంలో, సాంప్రదాయికంగాను, రాజ్యాంగపరంగానూ గొప్ప స్థానం ఉందని భావించే ఆదివాసులు పెద్దసంఖ్యలో చనిపోతుంటే, పాలిథిన్ కవర్లలో కళేబరాలు ‘నాగరక’ సమాజాన్ని ప్రతిపూటా పలకరిస్తుంటే, అదంతా పెద్ద విషయం కాదనీ, అనివార్యమనీ, ప్రభుత్వం మంచిపనే చేస్తున్నదని ఎట్లా అనుకోగలుగుతున్నారు? ఆరు నెలల్లో అయిదువందల మంది కదా? పోనీ, అందులో ఒక వందమంది మావోయిస్టులు అనుకున్నా 400 మంది ఆదివాసులే కదా? కాల్పులు నిజమైనవా, బూటకపువా చర్చ కూడా వద్దు, అంతమంది అతిసారతో చనిపోయినా అసెంబ్లీలు పార్లమెంటులు గగ్గోలు పెడతాయి కదా? ఇక్కడెందుకు కళ్లు మూసుకుపోతున్నాయి?
అందుకే, అహ్మదాబాద్ ప్రమాదం తరువాత ఎట్లా స్పందించాలో మనకు తెలియడం లేదు. కారకులు కనిపించడం లేదు కాబట్టి, ద్వేషం గురిపెట్టడానికీ కుదరడం లేదు. నలభై ఏండ్ల కిందట ‘కనిష్క’ విమానం అట్లాంటిక్ మీద మాయమైనప్పుడు, ప్రాణాలు కోల్పోయినవారి గురించి కాక, వారి కోసం విమానాశ్రయాలలో ఎదురుచూస్తున్న, దుర్ఘటన వార్త తెలిసి తమ వారి క్షేమం కోసం ఆచూకీ కోసం అల్లాడిపోతున్న బంధుమిత్రుల భావోద్వేగాలను ఒక ‘హ్యూమన్ ఇంటరెస్టింగ్’ కథనంగా రాసినట్టు గుర్తు. అప్పటికింకా మానవీయ కథనాలు ఇప్పటి యాంత్రికతను, కృత్రిమతను సంతరించుకోలేదు.
మనుషులలో అట్టడుగున అయినా ఎంతో కొంత తడి ఉంటుంది, ఒక సంక్షోభస్థితిలో గుండెలు పొడిబారినప్పుడు, ఆ ఆర్ద్రతను పైకి రప్పించగలిగితే, ఆ క్షణం వరకు అయినా నిస్పృహ, తామస, విష భావనల నుంచి విముక్తి దొరుకుతుందనిపిస్తుంది. అట్లా కాక, నిద్రిస్తున్న చీకట్లను రెచ్చగొట్టే అక్షరాలు, దృశ్యాలు మరింతగా మరింతగా అమానవీయం చేస్తాయి.