ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి
హన్మకొండ, ప్రజాతంత్ర : మారుతున్న కాలానుగుణంగా గ్రామాల్లో ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవడం అభినందనీయమని కాజీపేట ఏసీపీ (ACP) పింగిలి ప్రశాంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా హసన్‌పర్తి మండలం (Hasanparthi mandal) ముచ్చర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసిపి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. కుల, మత, రాజకీయ పార్టీలకతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండాలని, మద్య నిషేధం కోరుతూ గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టడంలో గ్రామ అభివృద్ధి కమిటీ, యువత చేసిన కృషి అభినందనీయమని, మిగతా గ్రామాలు కూడా ముచ్చర్ల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో గ్రామస్థులకు పోలీస్ శాఖ ప్రతినిత్యం అండగా ఉంటుందని అన్నారు.
గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారమిస్తే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముచ్చర్ల లో శాంతి భద్రతల కోసం కృషి చేస్తున్న గ్రామ పోలీస్ అధికారి నాగపూరి యాదగిరి గౌడ్ ను ఈ సందర్బంగా ఏసీపీ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో హసన్ పర్తి సీఐ చేరాలు, ఎస్సై రవికుమార్, సిద్దయ్య, కాంగ్రెస్ నాయకులు దేవరకొండ అనిల్ కుమార్, గ్రామస్తులు కూడా మాజీ చైర్మన్ సంఘంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, పెద్ది ఇంద్రసేన రెడ్డి, మాడూరి మనోహర్, మండల రవీందర్, చల్ల వెంకటేశ్వర్ రెడ్డి సుర ప్రతాప్, దామెర శ్యామ్, సారయ్య, మూర్తి అయ్యగారు, మాట్టడ సాంబయ్య, ప్రతాప్, జితేందర్, సాంబరాజు, పులిగారి రాజేష్, సుర ప్రమోద్, రాము యాదవ్, కంచనకుంట్ల మల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి, రావుల యుగేందర్ పాల్గొన్నారు




