సానిక ఎన్నికల్లో మెజారిటీ మనదే

– రేవంత్‌కు పాలన చేతకాకే ఈ దుస్థితి
– బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ ముఖ్య నాయకుల సమావేశంలో హరీష్‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 21: స్థానిక ఎన్నికలపై సర్వే చేయిస్తే మొత్తం 31 జిల్లా పరిషత్‌లలో 16 నుంచి 18 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని తేలిందని, ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అందరం కష్టపడి అత్యధిక స్థానాలు సాధించి కాంగ్రెస్‌ను ఓడిరచాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ గజ్వేల్‌ అని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడ్డ దాఖలాలు లేవని, రేవంత్‌ ప్రభుత్వంలో ఇప్పుడు ఎకరానికి ఒకటే బ్యాగ్‌ అంటుండడంతో మళ్లీ లైన్లలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రుణ మాఫీ అయింది 30 పైసల మందమేనని విమర్శించారు. నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావిస్తూ మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని రేవంత్‌ మాటతప్పారని, 12వేల ఉద్యోగాలిచ్చి 60వేలు ఇచ్చినం అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రేవంత్‌కు బుద్ధి చెప్పేందుకు అశోక్‌నగర్‌లోని విద్యార్థులు, నిరుద్యోగులు సిద్ధమయ్యారన్నారు. రాహుల్‌ గాంధీ పత్తాలేడన్నారు. రేవంత్‌కు పాలన చేతకాక ఈ పరిస్థితి ఏర్పడిరదని ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు. మల్లన్నసాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. గతంలో హల్దీ వాగులో ఎత్తిపోతలు చేపట్టి గద్దర్‌ వాళ్ల గ్రామానికి నీళ్లు వచ్చేలా చేశామని, కేసీఆర్‌ హయాంలో మోటార్లు కాలకపోయేవని, ఇప్పుడు మోటార్‌ వెండిరగ్‌ దుకాణాలకు గిరాకీ పెరిగిందని విమర్శించారు. రేవంత్‌ పాలనలో తెలంగాణలో రెండు ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో ఒక ఎకరం కొనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *