విూరు చెప్పే రాజ్యాంగాన్ని ఆచరిస్తారా?

– సుప్రీం తీర్పుపై రాహుల్‌కు హరీష్‌ రావు ప్రశ్న

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని హరీష్‌రావు ప్రస్తావిస్తూ విూరు బోధించే రాజ్యాంగ విలువలను విూరు ఆచరించగలరా అని రాహుల్‌ గాంధీని సూటిగా ప్రశ్నించారు. విూ తండ్రి దివంగత రాజీవ్‌ గాంధీ 52వ రాజ్యంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను విూరు కోరుతారా అని అని అడిగారు. లేదంటే రాజ్యాంగాన్ని చేతిలో మోసుకెళ్లడం కేవలం ఎన్నికల మోసమే అవుతుందని రాహుల్‌ను హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *