క్వాష్‌ ‌పిటిషన్‌కు దాఖలు చేసిన హరీష్‌ ‌రావు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని హరీష్‌ ‌రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. సిద్దిపేట కాంగ్రెస్‌ ‌నేత చక్రధర్‌ ‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీష్‌ ‌రావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *