– మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: అనాథ విద్యార్థులకు తిండి పెట్టలేని స్థితిలో ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్ధిపేటలో ఆనాథ విద్యార్థులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంపై విమర్శలు గుప్పించారు. గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల విద్యార్థుల మెస్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. రేవంత్ సర్కారు కమీషన్‌లు లేకుండా ఏ పనీ చేయడం లేదని ఆరోపించారు. విద్యార్థులు కమీషన్‌లు ఇచ్చుకోలేరు కాబట్టే మెస్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు పెండింగ్‌లో పెట్టినట్టున్నారని ఎద్దేవా చేశారు. వాటిని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం గ్రీన్ ఛానెల్ పెట్టి విద్యార్థులకు బిల్లులు ఇప్పిస్తనన్నడని, కానీ ఇంతవరకు బిల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతయని, చేతలు మాత్రం గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే తోలు వలుస్తా, తోడ్కలు తీస్తా అని రేవంత్‌రెడ్డి గొప్పలు మాట్లాడిండని, అయినా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే విద్యాశాఖ మంత్రివి.. అయినా మెస్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నయ్.. ఇప్పుడు ఎవరి తోడ్కలు తియ్యాలె అని ప్రశ్నించారు. చిల్లర మాటలు మాట్లాడుతూ విద్యార్థులకు సరిగా భోజనం పెట్టని రేవంత్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి తోడ్కలు తీసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. కేసీఆర్ గంట ప్రెస్ మీట్ పెడితే సీఎంకు, కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తున్నయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా రేవంత్‌రెడ్డి, ఆయన పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోయారన్నరు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.