– ఏడాదిన్నరగా తిరోగమన దిశలో పాలన
– కాళేశ్వరంపై విమర్శలతో గోదావరి జలాలు వృధా
– దెబ్బతిన్న రాష్ట్ర, రైతు ప్రయోజనాలు
– లండన్ బిఆర్‌ఎస్ సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్5: బిఆర్‌ఎస్ పార్టీకి కెసిఆరే సుప్రీం అని బిఆర్‌ఎస్ నేత హరీష్ రావు ప్రశంసించారు. లండన్ లో బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చు అని తెలియజేశారు. హైడ్రాతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఎన్నారైలు పెట్టుబడులు పెట్టడం లేదని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట్టడం దురదృష్టకరమని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందని తెలిపారు. పాలకులే నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. లండన్ పర్యటనలో భాగంగా ట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే నానుడి ఉండేది. కానీ కేసీఆర్ పాలనతో ’తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది’ అనే కాడికి తెచ్చాం. గత 10 ఏండ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జీఎస్‌డీపీ గ్రోత్‌లో తెలంగాణకు దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదు. నల్లా ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని కేసీఆర్ అందించారు. మ్యానిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటింటికీ తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్లియ్యకపోతే వోట్లు అడుగను అని చెప్పిన గొప్ప నాయకుడు. మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చేవారు. 4 గంటలకు కరెంటు కట్ ఉండేది. గ్రాణ ప్రాంతాల్లో 6 గంటల నుంచి 8 గంటల పవర్ కట్ ఉండేది. 60 ఏండ్లలో కాని పనిని కేసీఆర్ ఒక్క సంవత్సరంలో సాధించి 24 గంటల నాణ్యమైన కరెంటు-ను అందించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతీ ఉదయం విద్యుత్‌పై సక్ష చేసి, పవర్ కొనుగోలు టైమ్స్‌ని చూసేవారు. తర్వాత మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. అంకితభావంతో పనిచేసేవారు. అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. పదేండ్లయినా కూడా భారతదేశంలో ’హర్ ఘర్ జల్’ పూర్తికాలేదు. కానీ తెలంగాణలో మూడేండ్లలోనే మిషన్ భగీరథను పూర్తి చేసుకున్నాం. వ్యవసాయానికి సాగునీరు, తాగునీరు అందుతాయి. మిషన్ కాకతీయ ద్వారా మూడేండ్లలో దాదాపు 30 వేల చెరువులను పునరుద్ధరించాం. ఈ కార్యక్రమం మొత్తం దేశం దృష్టినే ఆకర్షించింది. దీనిని ఆదర్శం తీసుకుని అమృత సరోవర్ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్రం.. అధ్యయనం చేయడానికి రాష్టాన్రికి అధికారులను పంపించింది. రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7.7 శాతం గ్రీన్ కవర్‌ని పెంచి ఇండియాలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. అదేవిధంగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారు. ఎన్నికల ముందు ఒకాయన కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చిండు, నేను 48 గంటలు కరెంటు ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ కల్యాణ లక్ష్మి కింద రూ.లక్ష ఇస్తున్నారు కదా, మేము తులం బంగారంతో పాటు రూ.లక్ష ఇస్తామన్నారు. కాళేశ్వరం మోటర్లను మిడ్ మానేరు నుంచి ఆపరేట్ చేస్తాం. 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి. సాధారణ వర్షపాతం ఉన్న సంవత్సరంలో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసుకుంటే అక్కడినుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడ వర్షపాతం లేకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఉంటాయి. 37 లక్షల ఎకరాలకు సాగునీరు, 60 శాతం తెలంగాణకు తాగునీరు పరిశ్రమలకు 60 టీఎంసీలు ఇవ్వొచ్చు. కాళేశ్వరంలో 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థం ఉంది. మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. రూ.7 వేల కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లను మూసీకి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు. దానికి ఆధారం కాళేశ్వరం, మల్లన్న సాగరే కదా. కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండిందని ఉత్తంకుమార్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వం వచ్చాక ఒక చెరువు దగ్గర ఒక చెక్ డ్యాం కట్టారా?, ఒక ప్రాజెక్టు కట్టారా?, ఒక ఎకరానికి అయినా నీల్లు ఇచ్చారా అని ఆయనను అడిగా. మరి ఇంత పంట ఎలా సాధ్యమైందని ప్రశ్నించా. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని’ హరీశ్ రావు అన్నారు.





