బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు బైబై

మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. మీ నాయకత్వంలో నేర్చుకున్నాను, ఎదిగాను, సేవ చేశాను. పార్టీ ద్వారా లభించిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని గువ్వల తెలిపారు. అలాగే, నా మిషన్‌ మాత్రం కొనసాగుతుందని, చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడం నా లక్ష్యం అని స్పష్టం చేశారు. బలరాజు తన రాజీనామా వెనుక ఎలాంటి నిందలు లేవని, కేవలం గౌరవం, కృతజ్ఞతతోనే పార్టీకి వీడ్కోలు చెబుతున్నానని చెప్పారు. ‘ఇది బాధతో కూడిన రాజీనామా – కానీ పార్టీ పట్ల నా గౌరవం మారదని తుది వాక్యంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 9న గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *