- పూర్తిగా తగ్గిపోయిన పెట్టుబడులు
– రాష్ట్రానికి రావాలంటేనే భయపడుతున్న పరిశ్రమలు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్17: రేవంత్ రెడ్డి హయాంలో పెట్టుబడులు తగ్గడంతో పాటు, తెలంగాణకు గన్ కల్చర్ వొచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నివేదికల ప్రకారం తమ హయాంలో కన్నా పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోయాయని అన్నారు. బెదరింపులు, వసూళ్లే ఇందుకు కారణమని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే తుపాకీ పంపించారని, తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు డియాతో మాట్లాడారు. వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్క•తిని రేవంత్ హయాంలో తీసుకొచ్చారని ఆక్షేపించారు. రేవంత్‌రెడ్డి హయాంలో మాత్రం అవినీతి వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు, సినిమా ఇండస్టీ, కాంట్రాక్టర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య అక్రమ సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వొచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగు తుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మెదపటం లేదు..? అని నిలదీశారు. మంత్రుల పంచాయితీలు పరిష్కరించడానికే కేబినెట్ సమావేశాలు పెడుతున్నారని సెటైర్లు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేబినెట్ భేటీలో మంత్రులు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ ఆరడజను వర్గాలుగా విడిపోయిందని దెప్పిపొడిచారు. రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతలాగా మారిందని స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి హయాంలోని 23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దు కోవాలన్న చందంగా.. కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నీళ్లు, నిధుల వాటాలు సాధించామని అన్నారు. హ్యామ్ మోడల్‌పై బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని హెచ్చరించారు. హ్యామ్ మోడల్ బోగస్ అని.. కషన్లు దండుకోవటానికే ఈ మోడల్ తీసుకువస్తున్నారని ఆరోపించారు. దీపావళికైనా హాలు అమలు చేస్తారని ఎదురుచూసిన ప్రజలకు మళ్లీ నిరాళే ఎదురైందని మాజీమంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
—————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



