రూ.5 కోట్లకు పరిపాలనా అనుమతి
ములుగు, ప్రజాతంత్ర, జులై 27: ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. నాలుగు సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్‌అండ్‌బి శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి మేరకు గెస్ట్‌హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు పడినట్లయింది. ఈమేరకు నిధులు మంజూరు చేస్తూ ఆర్‌అండ్‌బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో జారీ చేశారు.





