అభయహస్తం కాదు.. అచేతన హస్తం

–  గ్యారెంటీ కార్డు గాసిప్‌ కార్డు అయింది
` రేవంత్‌ మోసాన్ని వివరించేందుకు బాకీ కార్డులు
` బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంర్ర, సెప్టెంబర్‌ 27: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, మాట తప్పిన రేవంతు మోసాన్ని ప్రజలకు వివరించేలా రూపొందించిన బాకీ కార్డులను బీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ అభయహస్తం అన్నరు.. బాండ్‌ పేపర్లు పంచారు అనే విషయం ప్రజలకు అర్థం అయిందన్నారు. ఆనాడు గాంధీ టోపీలు పెట్టి ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచారు. ఆ కార్డు గాసిప్‌ కార్డు అయిపోయింది.. వంద రోజుల్లోనే అమలు చేస్తాం, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తాం అన్నారు. రేవంతు మాటలు ప్రజలు నమ్మరని గాంధీలతో ప్రచారం చేయించారు. అయితే ఆ గాంధీలు ఈరోజు హైదరాబాద్‌కు రాని పరిస్థితి. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని వారికి భయం అని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు ముఖం చాటేస్తున్నారు అని ప్రశ్నించారు. మీ ముఖ్యమంత్రి అమలు చేయకపోవడంపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అవ్వకు, కోడలికి ఇద్దరికీ పింఛన్‌ అన్నారు. రైతుకు, కౌలు రైతుకు భరోసా అన్నరు. రేవంత్‌ రెడ్డి చీఫ్‌ మినిస్టర్‌ కాదు, కటింగ్‌ మాస్టర్‌ అయ్యిండు… బీఆర్‌ఎస్‌ ప్రారంభించిన చేపట్టిన పనులకు రిబ్బన్‌ కటింగ్‌ చేస్తుండు.. ప్రజా సమస్యలు చర్చించేందుకు పది రోజులు అసెంబ్లీ పెట్టాలంటే ఒక్క రోజు కాళేశ్వరం మీద పెట్టి పారిపోయిండు.. ప్రతిపక్షాల మీద అక్కసు వెళ్లగక్కిండు. రేవంతు రెడ్డి తెచ్చిన మార్పు లేదు.. ఏమార్పు తప్ప. ఆరోజు కాంగ్రెస్‌ వారు గ్యారెంటీ కార్డులను ఇంటింటికీి పంచితే నేడు బాకీ కార్డులను మేం పంచుతున్నాం.. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్‌ ఎన్నికలో మీ ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్‌ నాయకులను నిలదీయండి. ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండిరగ్‌, పీఆర్సీ గురించి మాట్లాడటం లేదు.. ఆటో కార్మికులకు రూ.12వేలు ఇస్తమని మోసం చేసిండ్రు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని వ్యవసాయ కూలీలకు మోసం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక మోసం.. రేవంతు మోసం చేయని వర్గం లేదు.. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు అందరూ మోసపోయారు అని తెలిపారు. పధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం.. బాకీ కార్డు విడుదలతో కాంగ్రెస్‌ మెడలు వంచుతామన్నారు. ప్రతి ఇంటికీ పంచుతూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ మోసాన్ని వివరిస్తారు అని ఆయన చెప్పారు. అక్రమ కేసులతో ప్రభుత్వాన్ని నడపలేవు రేవంతు రెడ్డి.. బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకలో ప్రజలు తిరగబడ్డరు.. రేవంతు ప్రభుత్వానికి కాలం దగ్గర పడ్డది అని హెచ్చరించారు. బాండ్‌ పేపర్‌ మీద భట్టి, రేవంతు సంతకాలు పెట్టి గ్యారెంటీ కార్డులు పంచారు.. గాంధీలు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు.. అవి ఎప్పుడు అమలు చేస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశ్నిస్తున్నదన్నారు. పాలనలో తమకు చాలా అనుభవం ఉంది అని డబ్బా కొట్టారు, ఏమైంది.. అని నిలదీశారు. కాగా, బాకీ కార్డులను విడుదల చేసే కార్యక్రమం చేపట్టిన కేటీఆర్‌కు హరీష్‌రావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *