గ్రూప్‌-1 మెరిట్‌ లిస్ట్‌ రద్దు చేయాలి

– హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ మెరిట్‌ లిస్ట్‌ను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్‌ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించింది. మెయిన్స్‌ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే ఫలితాలను విడుదల చేయాలని మంగళవారం ఇచ్చిన తీర్పులో ఆదేశించింది. రీవాల్యుయేషన్‌కు ఎనిమిది నెలల సమయం ఇచ్చింది. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. కాగా, హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్‌సీ సమీక్షిస్తోంది. అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయి తుది నియామకాలు పెండిరగ్‌లో ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలువురు గ్రూప్‌-1 అభ్యర్థులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *