హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థుల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సెలక్షన్ లిస్ట్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-3కి 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్ 17, 18 వ తేదీల్లో జరిగిన గ్రూప్-3 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ అసిస్టెంట్, ఎల్‌డి స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్షకు సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచింది. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల తుది తీర్పుకు లోబడి ఈ ఫలితాల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒక్క ఖాళీని ప్రస్తుతం విత్‌హెల్డ్ లో ఉంచింది కమిషన్. తప్పుడు వివరాలు సమర్పించినట్లు తేలితే ఎంపికను రద్దు చేస్తామని కమిషన్ హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



