– సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందంటూ మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు పిలుపునిచ్చారు. శాసనసభలోలోని సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించారన్నారు. సభలో మాట్లాడే అంశాలపై విప్‌ల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వలేదు.. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదు.. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు తనను సభకు రాకుండా చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. మహిళా సభ్యులు హాజరుతోపాటు చర్చల్లో పాల్గొనాలని, చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని అన్నారు. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు.. ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది.. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని హితవు పలికారు. పార్టీ, ప్రభుత్వపరమైన లైన్‌లోనే అందరూ స్పందించాలన్నారు. ఇది మన ప్రభుత్వం.. ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్‌నే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుందని అన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై ఫోకస్ పెట్టాలని, 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





