– తెలంగాణ భవిష్యత్కు రోడ్ మ్యాప్
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసు కుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 నిర్వహించుకుం టున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్నారు. శుక్రవారం ఆయన అధికార్లతో స మీక్షా సమావేశంలో ప్రసంగిస్తూ డిసెంబర్ 8 న ప్రజా ప్రభుత్వ రెండో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించా లన్నారు.. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్ – 2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించుకోబోతున్నామన్నారు. తెలంగాణ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ రూపొందించుకోబో తున్నామ న్నారు. పాలసీ ఆధారంగానే భవిష్యత్ నిర్ణయా లను తీసుకునేందుకు వీలుంటుందన్నారు. పాలసీ డాక్యుమెంట్ తో పెట్టుబడిదారులకు ఒక స్పష్టత కవస్తుందన్నారు. శాఖలవారీగా పాలసీలకు సంబంధించి =సమ్మిట్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికార్లను ఆదేశించారు. -ఈ నెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యు మెంట్ సిద్దం చేయాలన్నారు. ఈ గ్లోబల్ స మ్మిట్ కు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వా నించమని అధికార్లకు సూచించారు. వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





