కంచ గచ్చిబౌలీ 400 ఎకరాల భూ వివాదం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ,రాష్ట్ర ప్రభుత్వంల మధ్య పతాక స్థాయికి చేరుకుంది. భూ యాజమాన్య హక్కుల వివాదంతో పాటు పర్యావరణం, వన్యప్రాణుల పరిరక్షణ అంశాలు కూడా తెర పైకొచ్చినాయి. 400 ఎకరాల కంచ గచ్చి బౌలీ లో ఎటువంటి వన్య ప్రాణులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభ లో ప్రకటన చేయగా.. అక్కడ అసలు అడవే లేదనీ.. గత 20 సంవత్సరాలుగా సంరక్షణ లేక ఆ భూమిలో చెట్లు మొలిచాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందనీ ..రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమిన్కెనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాదన. భూమి అటవీ శాఖ పరిధిలోనిది అయితే రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖ అధికారులు భూమి ని వేలానికి పెట్టే సాహసం చేయరని విశ్లేషకుల అభిప్రాయం.
హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దని..
హెచ్ సీయూ అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి,చూస్తే కానీ అర్థం కాదు ..ఇందులో ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులు ఉన్నాయి ..ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి వందల ఏళ్ళు పడుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయం. భిన్న వాదనలు..అభిప్రాయాలు తెరపైకి వొస్తున్నా.. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సహజంగా ఉన్న అడవినో లేక నిర్లక్ష్యానికి గురైన 400 ఎకరాల్లో వృక్ష సంపద పెరిగి..అనేక వన్య ప్రాణులకు నిలయమై స్వచ్ఛ మైన గాలి, ఆహ్లాద కరమైన వాతావరణం అందిస్తున్నప్పుడు దాన్ని పరిరక్షించుకోవడం పాలకుల బాధ్యత.ప్రకృతి అనేది జీవన ఆధారం.
మనిషి, జంతువు, వృక్షజాలం అన్నీ ఒకే జీవ వ్యవస్థలో భాగాలు. కానీ శతాబ్దాలుగా అభివృద్ధి పేరిట ప్రకృతిపై జరుగుతున్న దాడులు, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పారిశ్రామికత, పట్టణీకరణ, వన నాశనం, ప్లాస్టిక్ వినియోగం, వాహనాల కాలు ష్యం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రమ య్యేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యా వరణ పరిరక్షణ మనిషికి అత్యవసరంగా మారింది. వృక్ష సంపదను కాపాడటం, నీటి వన రులను పరిరక్షించడం, గాలి నాణ్యతను మెరుగు పరచడం ఇప్పుడు అత్యంత కీలకమైన పనులు.
ఇదే సమయంలో వన్యప్రాణుల సం రక్షణ కూడా అంతే ప్రాధాన్యత గల అంశం. వన్యప్రాణులు లేకుండా జీవవ్యవస్థ అసంపూర్ణం. పులులు, ఏనుగులు, జింకలు వంటి జంతువులు ఎకో సిస్టమ్‌లో సమతుల్యతను నిలబెడతాయి. కానీ వేట, నివాస నష్టం, అక్రమ వాణిజ్యం వల్ల ఈ జీవులు అంతరిం చిపోతున్నాయి. ఈ విపత్తును ఎదుర్కొనడంలో ప్రభు త్వాల పాత్ర ఎంతో కీలకం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభు త్వాలు పలు చట్టాలను తీసుకువ చ్చాయిువన్యప్రాణి సంరక్షణ చట్టం (1972), పర్యావరణ పరిరక్షణ చట్టం (1986), బయోలాజికల్ డైవర్సిటీ చట్టం (2002) వంటి వాటి ద్వారా వన్యప్రాణులకు రక్షణ కల్పిస్తున్నారు. అటవీ ప్రాంతాల రక్షణకు జాతీయ ఉద్యానవనాలు, రిజర్వ్ ఫారెస్టులు ఏర్పాటు చేశారు.
హరితహారం, మిషన్ కాకతీయ, స్వచ్ఛ భారత్ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం పెంచుతున్నాయి.అయితే ఈ చట్టాలు, కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అవసరం. ప్రభుత్వ విధానాలు కేవలం కాగితపైనే కాక, క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చాలి. పర్యావరణ విద్యను విద్యా వ్యవస్థలో భాగంగా చేర్చాలి. స్థానిక సంస్థలు, గ్రామసభలు, పౌర సమితులు ఈ పనిలో భాగస్వాములుగా మారాలి.ప్రకృతిని ప్రేమించ డమంటే భవిష్యత్ తరాల జీవితాన్ని ప్రేమిం చడమే. వన్యప్రాణులకు జీవించే స్వేచ్ఛ ఇవ్వాలి. పచ్చని భూమిని పరిరక్షించాలి. ప్రభుత్వాల ప్రణాళికలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.





