– తెలిసి తప్పిదాలు చేసిన ప్రభుత్వం
-బీసీలకు అన్యాయం
– డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగానే హైకోర్టు స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు విమర్శించారు. గురువారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఉద్దేశపూర్వక తప్పిదాలతో బీసీలకు అన్యాయం జరిగేలా వ్యవహరించిందని ఆరోపించారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు సమగ్రంగా వినిపించలేకపోయిందని, న్యాయమూర్తుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని అభిప్రాయపడ్డారు. మొదటి నుంచీ పరిపాలనలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినా, రేవంత్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా బీసీల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. “బీసీల హక్కులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇకనైనా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ వాదనలకు సమగ్రంగా సిద్ధం కావాలి. ఇచ్చిన వాగ్దానం నిలబెట్టడానికి ప్రభుత్వం నిజాయితీ కృషి చేయాలి” అని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



