పల్లెగోస పట్టదా.?. పంచాయితీ ఎన్నికలు పెట్టరా.?

“లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంత పెరుగుతుంది.అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సహజంగా కనిపిస్తుంది.ఎక్కువ గ్రామ పంచాయితీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికిప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు లాభం కంటే మేజార్టీ స్థానాల్లో గెలవకపోతే క్యాడర్‌లో మళ్లీ ఓటమి నైరాష్యం ఏర్పడుతుందని. ఎన్నికలు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తగ్గింస్తుందని లోకల బాడీ ఎన్నికలపై ప్రతిపక్షం కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం లేదు.”

దాదాపు రెండేళ్లుగా గ్రామ పంచాయితీ ఎన్నికలు లేకపోవడం. గ్రామాలాభివృద్దిలో కీలకపాత్ర పోషించే సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్లు, ఎంపీటీలు లేకపోవడంతో గ్రామాలు అభివృద్దికి నోచుకోవడం లేదు. గ్రామాల్లో సంక్షేమం కుంటుపడింది. అనేక సమస్యలతో పల్లే జీవనం అతలాకుతలం అవుతోంది.రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు జీవచ్ఛవంలా మారాయి. గ్రామ పంచాయితీకి నిధులు లేవు. గ్రామాల్లో శుభ్రత లేదు. తాగు నీరు లేదు. వీధిలైట్లు ఆరిపోయాయి.రోడ్లు లేవు. మురికి కాల్వలా మెంటనేన్స్‌ లేదు. వర్షాలతో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలతో పల్లెలు ఆనారోగ్యంతో మంచం పట్టాయి. రెండేళ్లుగా గ్రామాలు అభివృద్దికి దూరంగా ఉన్నాయి. సర్పంచ్‌ల పదవికాలం ముగిసి రెండేళ్లైనా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకలేదు.

ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో ప్రజలను పట్టించుకునే వ్యవస్థ లేదు..అధికారుల పాలనలో గ్రామాలు మగ్గిపోతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్‌ లేదు.ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల పాలన లేకపోవడంతో 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు, 74వ రాజ్యాంగ సవరణతో మునిసిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించిన ఎన్నికైన పాలన వ్యవస్థ లేకపోవడంతో కేంద్రం నుంచి చట్టబద్దంగా వచ్చే గ్రాంట్స్‌ కూడా నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ప్రత్యేకాధికారులు ప్రజలపై పన్నులు వేస్తున్నారు. ఉపాధి లేక.వ్యవసాయం కుదేలై. ఇబ్బందులు పడుతున్న టైంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఇంటి పన్ను నల్ల పన్ను. ఇతర పన్నుల పేరుతో ప్రజలను అధికారులు వేధిస్తున్నారు. గ్రామ పంచాయితీకి నిధులు లేకపోతే మేమేం చేస్తామంటూ అధికారులు గ్రామాలను గాలికి వదిలేశారు.

అధికారుల పాలనలో గ్రామాలు దీన స్థితిలో ఉన్నాయి. ప్రజల సమస్యలను అడ్రెస్‌ చేసే వ్యవస్థే లేదు.అధికారులున్న జనాలకు జవాబుదారితనం లేకుండా పోయింది.20 నెలలుగా కేంద్ర రాష్ట్రాల నుంచి చిల్లిగవ్వ రాకపోవడంతో అధికారులు జేబుల్లోంచి ఖర్చు చేయాల్సిన వస్తుంది..అయితే ప్రభుత్వం నుంచి నిధులు లేకపోవడం.ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రుల పర్యటనలకు గ్రామ పంచాయితీ అధికారులు తమ జేబుల్లోంచి ఖర్చులు పెట్టడం.తిరిగి ప్రభుత్వం రిఫండ్‌ లేకపోవడంతో అధికారులు సైతంలో అప్పుల్లో మగ్గే పరిస్థితి వచ్చింది. ఇక ఆరోగ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.నో వీధిలైట్లు. నో రోడ్ల నిర్వాహణ. గుంతల రోడ్లు.. గ్రామాల్లో వైద్యం పడేకేసింది.ప్రజల ఆరోగ్యం గురించి పట్టించేకునే నాదులే లేకపోవడంతో గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్‌,చికున్‌ గున్యా, డెంగ్యూ వంటి విష జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.అంటు వ్యాధులు, ఆనారోగ్యాలతో జనాలు మంచం పట్టుతున్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యంతో గ్రామాలు స్మశానవాటిలను తలపిస్తున్నాయి.సర్కార్‌ హెల్త్ క్యాంప్‌లు కనిపించడం లేదు.దీంతో ప్రజలు భయంలో కార్పోరేట్ ఆస్పత్రులకు క్యూ కట్టుతున్నారు.

రాజకీయ పార్టీల చదరంగంలో గ్రామాలు బలైతున్నాయి. అధికారం,గ్రామ రాజకీయాలపై పట్టు కోసం ఆడుతున్న గేమ్‌లో పార్టీలు గెలుస్తున్నాయి ప్రజలు ఓడిపోతున్నారు.రెండేళ్లుగా పంచాయితీ ఎన్నికలు లేకపోవడంతో గ్రామాలు ఆర్ధిక రాజకీయ సామాజిక విధ్వంసానికి గురైతున్నారు.సర్పంచ్ లు లేకపోవడంతో గ్రామాలాభివృద్ధి కుంటుపడటమేకాదు..20 నెలలుగా ఎన్నికలు లేక..ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో ప్రజలకు ప్రభుత్వం జవాబుదారితనం లేకుండా పోయింది.గ్రామాలను ప్రభుత్వం ఆనాథులుగా వదిలి వేసింది..రెండేళ్లు ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గాంధీ కలగన్న గ్రామాలపై వివక్ష చూపిస్తున్నారు.గ్రామాలే దేశానికి పట్టుగోమ్మలన్న మహాత్ముడి ఆశయాలకు విరుద్దంగా రెండేళ్లుగా ఎన్నికలు పెట్టకుండా.73,74 రాజ్యాంగ సవరణలు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది.

అంతేకాదు, ఆర్ధికంగా, సామాజికంగా గ్రామాలు దేశానికి పట్టగోమ్మలేకాదు.రాజకీయంగా కూడా పల్లెలు దేశానికి బలమైన పునాదులే.దేశానికి ప్రధాని అయిన గ్రామీణ రాజకీయంగా కేంద్రంగానే ఎదగాలి.గ్రామీణ రాజకీయ పునాది దేశాన్ని బలంగా ఉంచుతుంది.గ్రామీణ రాజకీయ నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంటే ప్రపంచంలో దేశంలో అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది.కానీ అలాంటి గ్రామీణ యువ నాయత్వం ఎదగకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది.పంచాయితీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుండటంతో యువత రాజకీయ అవకాశాలు కోల్పోతోంది.ఇవాళ చైనా ప్రపంచంలోనే రాజకీయంగా ఆర్ధికగా శక్తిగా నిలుస్తుందంటే ఆ దేశం గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసింది.పల్లె నాయకత్వాన్ని సంఘాలు సమూహలతో ఎంకరేజ్‌ చేసింది.

రిజర్వేషన్ల పేరుతో పంచాయితీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తుంది.ఎన్నికలకు మరి కొంత కాలం వాయిదా వేయాలన్న ఉద్దేశ్యంతో బీసీ రిజర్వేషన్లపై చట్టం తీసుకువచ్చి.బంతిని కేంద్రం కోర్ట్‌లోకి నెట్టి చేతులు దులుపుకుంది.ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తుంది.బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకున్న రాష్ట్రంలో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించవచ్చు.అయితే ప్రతిపక్ష ట్రాప్‌లో పడ్డ కాంగ్రెస్‌ రిజర్వేషన్ల తర్వావే ఎన్నికలంటూ తప్పించుకుంటుంది. .ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థలు నిర్వహిస్తే పంచాయితీలకు నిధులు ఇవ్వాల్సి వస్తుందని, అభివృద్ది పనులు ప్రారంభించాల్సి వస్తుంది.సంక్షేమం అమలు చేయాల్సి ఉంటుంది.

ప్రజా ప్రతినిధులు ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతుంది..ప్రభుత్వంపై మరింత భారం పడుతుందన్న ఉద్ధేశ్యంలో రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తుందన్న వాదన ఉంది.అయితే లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంత పెరుగుతుంది.అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సహజంగా కనిపిస్తుంది.ఎక్కువ గ్రామ పంచాయితీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికిప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు లాభం కంటే మేజార్టీ స్థానాల్లో గెలవకపోతే క్యాడర్‌లో మళ్లీ ఓటమి నైరాష్యం ఏర్పడుతుందని. ఎన్నికలు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తగ్గింస్తుందని లోకల బాడీ ఎన్నికలపై ప్రతిపక్షం కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం లేదు.

అధికార ప్రతిపక్షాల రాజకీయ క్రీడలో రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి కానీ,వోట్లేసిన ప్రజలు మాత్రం ఓడిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి కానీ పార్టీలు గెలుస్తున్నాయి. ఇది దేశానికి చాలా ప్రమాదకరం.గ్రామ స్వరాజ్యం ఎంత బలహీనపడితే రాష్ట్రం దేశం అంత బలహీనపడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుండా ఎంత కాలయాపన చేస్తే రాష్ట్రం అంత దివాలా తీస్తుంది. పాలన గాడి తప్పుతుంది. భారత రాజ్యాంగం మూడు అంచెల పాలనను, అంటే కేంద్ర, రాష్ట్ర,స్థానిక ప్రభుత్వాలను ప్రజలకు వాగ్దానం చేసింది. ఇప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తే రాజ్యాంగాన్ని అపహస్యం చేసినట్లే అవుతుంది.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినట్లవుతుంది.ప్రజల రాజకీయ హక్కులను హరించినట్లవుతుంది. రాజ్యాంగాన్ని అమలు చేయలని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతుంది..పల్లె అభివృద్ది వాతావరణం చెడిపోతే..రాష్ట్రం దివాలా తీస్తుంది..రాష్ట్రానికి దేశానికి పునాదులైన గ్రామాలు కుదేలైతే..ఆర్ధిక రాజకీయ, సామాజిక సంక్షోభం ఏర్పడుతుంది..గ్రామాల పట్టుగొమ్మలు విరిగిపోతే రాష్ట్రం మోడుబారుతుంది.

-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *