జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

డిసెంబర్ 3న మహా ధర్నా
-తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ హలీ

జర్నలిస్టుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ హలీ మాట్లాడారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి ఇవాళ జర్నలిస్టులు నెట్టివేయబడడానికి కారకులు ఎవరు? అసలు జర్నలిస్టులు రోడ్డున పడి మా సమస్యలను పరిష్కరించండి అంటూ వేడుకునే పరిస్థితికి కారకులు ఎవరో చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనలో ముందు వరుసలో ఉండి తూటాలకు, లాటీలకు భయపడకుండా కేసులకు జంకకుండా ఉద్యమించింది జర్నలిస్టులని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనతో అన్ని రంగాల్లో ఆశించినట్లే మా జీవితాల్లో కూడా చీకటి తొలగిపోయి వెలుగు సాధించబడుతుందని జర్నలిస్టులు కలలు కన్నారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం, పదేళ్లైనా జర్నలిస్టులు ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టలేదు, ప్రవేశపెట్టినా అమలు సరిగ్గా చేయలేదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సాధించిన సౌకర్యాలను కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సౌకర్యాలను కూడా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలు కాకపోవడం విచారకరం అన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్ట్ సమస్యల పట్ల స్పందించట్లేదనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్ట్ కోసం స్పష్టమైన హామీలు ఇచ్చిందన్నారు. జర్నలిస్ట్ సంక్షేమం పట్ల మొదటిసారి ఏ పార్టీ మేనిఫెస్టోలో చేర్చినటువంటి సంక్షేమ పథకాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. జర్నలిస్టుల మద్దతుతో అధికారాన్ని చేపట్టిందన్నారు. జర్నలిస్టులు కూడా ఎంతో మురిసిపోయారని, మా సంక్షేమాన్ని ఆశిస్తున్నారు గనుక మా కష్టాలు ఇక తొలగిపోతాయని ఆశపడ్డారు. కానీ రాష్ట్రంలో జర్నలిస్టులు పరిస్థితి చాలా నిరాశ తప్ప అసంతృప్తి తప్ప, జర్నలిస్టులు సాధించింది, వాళ్లకు అమలైంది ఈ రాష్ట్రంలో ఏమీ లేదన్నారు. గొంతమ్మ కోరికలు కోరడం లేదని, కనీస సౌకర్యాలు మాత్రమే తీర్చమంటున్నారని పేర్కొన్నారు. బ్రతకడానికి వాళ్ళ వృత్తి పరమైన సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందులో ప్రధానంగా మా ఆరోగ్యానికి భద్రత కల్పించమంటున్నారు. హెల్త్ కార్డులు జారీ చేయమంటున్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో హెల్త్ కార్డులు ఎంతో సక్రమంగా పగడ్బందీగా అమలు చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్లు మాత్రమే హెల్త్ కార్డులు ఈ రాష్ట్రంలో జనలిస్ట్ కి అమలైనాయి. మరి గత ప్రభుత్వం జారీ చేసిన అక్రెడిటేషన్ కార్డు మీదనే స్టిక్కర్లు అతుక్కు పెట్టుకుంటూ రెండేళ్ల నుండి ఎందుకు మళ్ళా అదే అక్రెడిటేషన్ కార్డు రెన్యువల్ పేరు మీద ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ఖజానాతోను బడ్జెట్ తోను అక్రెడిటేషన్ కు సంబంధం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని పండిపడ్డారు. మూడు నెలలుగా ఎలాంటి ప్రగతి లేదన్నారు. అక్రిడేషన్ లేవు, హెల్త్ కార్డు లేవు, ఇల్లు, ఇంటి స్థలాల విషయం ఈ రాష్ట్రంలో ప్రధానమైందన్నారు. అసలు ఇల్లు ఇంటి స్థలాల కోసం అంటే ఒక గూడు సౌకర్యం కల్పించమని జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ప్రభుత్వాల్ని అడుగుతున్నారు. మా సంఘం కూడా ఈ విషయంలో ఎన్నో సార్లు పోరాడింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏందంటే మనసు ఉంటే మార్గాలు ఎన్నో. మీరు తలుచుకుంటే. ముఖ్యమంత్రి ఆ సమస్యను పరిష్కరించడం మీకు పెద్ద పని ఏం కాదు. మీరు ఏదో రూపంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హోసింగ్ సొసైటీ(జే.ఎన్.జే)కి కుటుంబాలకి న్యాయం చేయాలని మా యూనియన్ కోరుతుంది. 25 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఇంటి స్థలాల సమస్య కూడా పరిష్కారం చూపాలని మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో కూడా చాలా చోట్ల ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. చిన్న చిన్న మధ్య తరగతి పత్రికల అడ్వర్టైజ్మెంట్ పెండింగ్ బిల్లులు చెల్లించాలి. చిన్న మధ్య తరగతి పత్రికలకు కూడా రాష్ట్రంలో అండగా నిలబడి వారిని ఆదుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం భద్రత కోసం కొన్ని ప్రత్యేక కమిటీలు ఉండేటివి. ప్రొఫెషనల్ కమిటీస్ అని తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు కాగితాల నుండి ఫైళ్ల నుండి మాయమైపోయినాయి. అందులో ముఖ్యంగా విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులపై దాడులు జరిగిన, వాళ్లకి ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఆ శక్తులపై చర్యల కోసము లేదా పోలీసులు నుండి ఎదురయ్యే దాడుల గురించి కావచ్చు అక్రమంగా దాడి చేసిన విషయంలో విచారణలు జరిపేందుకు దాడికి వ్యతిరేక కమిటీ. హై పవర్ కమిటీ అనేది గతంలో రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత హై పవర్ కమిటీ ఆచికి లేకుండా పోయింది. అట్లాగే జర్నలిస్ట్ ల ఇది సంక్షేమ కమిటీ ఉండేది. అది లేదు. వేతనాలను పరిశీలించేందుకు త్రైపాక్షిక కమిటీ ఉండేది. అది లేదు. ఇట్లా వృత్తిపరమైన కమిటీలు మాయమైపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పథకాలు ఇచ్చేయండి. మరి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఏం పాపం చేశారు? అసలు వాళ్ళని ఎందుకు ఇంత విస్మరిస్తున్నారో. అసలు ఎవరికీ కూడా అంతుపట్టని పరిస్థితి. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు 33 జిల్లాల్లో జర్నలిస్టు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఈ ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయింది. ఇక మాకు ఏకైక మార్గం పోరు మార్గమే. అందుకే డిసెంబర్ మూడవ తేదీన రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయ ముందు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మహాధర్నా కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తుంది. 33 జిల్లాల నుండి వందలాది మంది జర్నలిస్టులు ఈ మహాధర్నా కార్యక్రమంలో పాలుపంచుకొనున్నారు. మేము ధర్నా నిర్వహించి మా సమస్యలన్నిటిని ఒక వినతి పత్రం ద్వారా సమాచార శాఖ కమిషనర్ కు అందిస్తాం. మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరించడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(హెచ్.యూ.జే) అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్, హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *