- ఫార్ములా ఈ కార్ రేసు కేసు కీలక మలుపు
- కెటిఆర్‌కు ముందే పిటిషన్ దాఖలు చేయడంతో ఖంగు
ఫార్ములా ఈ కార్ రేసు కేసు కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కెవియేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే ఆశ్రయించింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అందరికి ’రూల్ ఆఫ్ లా’ వర్తిస్తుందని కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు గుర్తుచేసింది.





