హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: దసరా నవరాత్రుల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌ను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 708 మంది ఎఫ్‌టీఎస్‌లు టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుతారు. అలాగే ఆయా ఉద్యోగుల జీతాలు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొనగాల మహేష్ స్పందిస్తూ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





