– సగటున పది గ్రాములపై 1200 పెరుగుదల
న్యూదిల్లీ, మార్చి 17: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.1200ల మేర పెరిగింది. వెండి ధర కూడా సగటున రూ.5 వేల మేర ఎగబాకింది. ధరలు దిగివచ్చినప్ప్పుడు వందల్లో దిగుతూ పెరిగితే వేలల్లో పెరగడం గమనార్హం. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620లకు ఎగబాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.1200ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర కూడా రూ.1100ల మేర పెరిగి రూ.1,45,400కు చేరుకుంది. నగరంలో వెండి ధర రూ.4 వేల మేర పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.8 లక్షలు పలుకుతోంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,820గా ఉంది. దిల్లీలో రూ.1,58,770 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,58,620గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,46,500గా, దిల్లీలో రూ.1,45,550గా ఉంది. ముంబై, దిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.1,45,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.2.8 లక్షలకు చేరుకోగా ఇతర ప్రధాన నగరాల్లో రూ.2.75 లక్షల వద్ద కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




