మరో రూ.2వేలు తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పదిహేను రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి భారీగా తగ్గింది. ఈ క్రమంలో బంగారం ధర గురువారం కూడా భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. భారత్‌లో నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,22,400 ఉంది. ఇవాళ రూ.1,910 మేర తగ్గి రూ.1,20,490 చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *