– పెరుగుతున్న ధరలతో సామాన్యుల బెంబేలు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 22 : బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం కొనడం కలగానే మారిపోయేలా ఉంది. సోమవారం తులం గోల్డ్ ధరపై రూ.430 పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బంగారం ప్రియులు వామ్మో.. అంటూ గుండెల మీద చేయి వేసుకుంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.430 పెరగడంతో రూ.1, 12, 580 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరగడంతో రూ.1, 03, 200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 పెరగడంతో రూ.84,440 దగ్గర అమ్ముడవుతున్నది. ఇక కిలో వెండిపై రూ.3,000 పెరగడంతో రికార్డ్ స్థాయిలో రూ. 1,38, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,48,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,38, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





