– రెండవ ప్రమాధ హెచ్చరిక
– మూడవ హెచ్చరిక చేరువలో ప్రవాహం
భద్రాచలం, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద తగోదావరి పరవళ్ళు తొక్కుతుంది.సోమవారం నుండి క్రమంగా పెరిగిన గోదావరి మంగళవారం సాయంత్రంకు వేగంగా పెరుగుతూ మంగళవారం సాయంత్రంకు 50 అడుగులకు దాటి ప్రవహిస్తుంది.ఇప్పటికే రెండవప్రమాధ హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది.ఇది క్రమంగా పెరుగుతూ మూడవ ప్రమాధ హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవహిస్తుంది.గోదావరి భారీగా పెరగడంతో దుమ్ముగూడెం,చర్ల,వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే కూనవరం,చింతూరు,విఆర్‌పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ముంపుప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు.ఎలాంటి అవాఛనీయసంఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అదికారులను అప్రమత్తం చేసారు.గోదావరి ప్రవాహాన్ని భద్రాచలం సబ్‌కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట మంగళవారం పరిశీలించారు.ఈ ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం భద్రాచలం 08743-232 444, వరదల కంట్రోల్ రూమ్ 7981219425, జిల్లా కలెక్టర్ కార్యాలయం పాల్వంచ 08744-241950, ఐటీడీఏ కార్యాలయం భద్రాచలం 7995268352 వరదల కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించాలని అన్నారు. ముంపు ప్రాంత ప్రజల కొరకు అధికారులు 24 గంటలు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని, వరద ఉధృతి ఎక్కువైతే ముంపునకు గురి అయ్యే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేయడం జరిగిందని అన్నారు.గోదావరి కరకట్ట ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఎవరు కరకట్ట ప్రదేశాలకు వెళ్లకూడదని అన్నారు.





