– తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
– కేసీఆర్, హరీష్‌ల పిటిషన్లపై విచారణ అక్టోబరు 7కు వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్, హరీష్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట కలిగింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫున ఏజీ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించినట్లు, దీనిపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. సీబీఐ విచారణ తర్వాత కేసీఆర్, హరీష్‌రావులపై చర్యలు ఉంటాయని వెల్లడిరచారు. కాగా, తదుపరి విచారణ వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





