పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 16: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇక్రిశాట్ సమీపంలో ఓ పరిశ్రమ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు నిఘా ఉంచారు. ఆ పరిశ్రమ వద్ద కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా మన్నేకలి గ్రామానికి చెందిన ఖురేషి షబ్బీర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. అతడి నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
8 కిలోల గంజాయి స్వాధీనం





