తోటలో దాచిన గంజాయి పట్టివేత

భద్రాచలం, జూలై 7: అశ్వరావుపేట, దమ్మపేట మండలాల సరిహద్దు గ్రామమైన అచ్యుతాపురం సపంలోని ఓ ఆయిల్‌ ‌పామ్‌ ‌తోటలో సోమవారం ఉదయం భారీగా గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. రవాణాకు సిద్దం చేసి దాచిటనట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఆయిల్‌పామ్‌ ‌తోటను ఆనుకొని ఉన్న పంట కాలువలో గుర్తుతెలియని వ్యక్తి 44 ప్యాకెట్ల గంజాయిని దాచి ఉంచాడు. ఆదివారం రాత్రి భారీగా వర్షం కురవడంతో.. కాలువలో ప్యాకెట్లు పైకి తేలాయి. ఉదయాన్నే తోటలోకి వచ్చిన యజమాని పంట కాలువలో ప్యాకెట్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అశ్వరావుపేట సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్‌ ‌రెడ్డి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లు- అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకువచ్చారు అనే అంశాలపై విచారణ సాగిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *