హైదరాబాద్,సెప్టెంబర్ 20:రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి భారత్‌కు వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలుపై అధికారులు అనుమానం వ్యక్తం చేసి తనిఖీలు నిర్వహించారు. చెక్‌ఇన్ లగేజీని పరిశీలించగా 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆ మహిళకు సంబంధించిన మిస్సింగ్ లగేజీలో కూడా మరో 6 కిలోల గంజాయి బయటపడింది. ఇలా మొత్తంగా 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. ఈ గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.12 కోట్లు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, మత్తుపదార్థాల అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





