– ముఖ్యమంత్రి, సినీ ప్రముఖులు హాజరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14: తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం హైటెక్ సిటీలో అట్టహాసంగా మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాలు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎం.డి. హరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. సినీ ప్రముఖులు అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, సుకుమార్, మణిరత్నం, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. పలువురు విజేతలకు మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవార్డులు ప్రదానం చేశారు. మొమెంటోతో పాటు రూ.5లక్షలు, ప్రశంసాప్రతం అందజేశారు.

అవార్డుల వివరాలు
– ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
– ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్…మేం ఫ్రెండ్సండీ
– ఉత్తమ సహాయ నటుడు- ఏ.జె.సూర్య (సరిపోదా శనివారం)
– ఉత్తమ సహాయనటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్)
– ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ శిశురోలియో (రజాకార్)
– ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్, ఊరు భైరవకోన (నిజమే నే చెబుతున్నా)
– ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయాఘోషల్ (పుష్ప2) సూసేటి అగ్గిరవ్వ, హాజరు కాలేదు
– ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర ఆయుధపూజ)
– ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)
– ఉత్తమ హాస్య నటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తువదలరా2)
– ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
– ఉత్తమ సినిమాటో గ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
– ఉత్తమ ఆర్డ్ డైరెక్టర్: అధ్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898)
-ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనారావు, అంజన్ కుమార్ (కల్కి 2898)
– ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : నల్ల శ్రీను (రజాకార్)
– ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
-ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజుయాదవ్)
-ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌షాప్ మూర్తి)
-ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
-ఉత్తమ బాల నటుడు: అరుణ్‌దేవ్ (35 చిన్న కథకాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
-ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మొనీ సోషల్ అప్‌లిస్ట్: కమిటీ కుర్రాళ్లు
ఈ సందర్భంగా జ్యూరీ కమిటీని సత్కరించారు. మురళీమోహన్, జయసుద తదితరులు పురస్కారాలు అందుకున్నారు. వేదికపై ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.





