– ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరుట్ల
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆరుట్ల కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండాలని, చదువులో రాణించేందుకు విద్యార్థులు ముందునుంచి కష్టపడాలని ఉద్బోధించారు. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఈ ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జానపద, సినిమా, భక్తి పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు, కామెడీ స్కిట్స్ అలరించాయి. ప్రిన్సిపాల్ ఆరుట్ల కిషోర్ కుమార్ కుమారులు ప్రత్యేకంగా ప్రదర్శించిన తబలా, కీబోర్డు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు భవిష్యత్తులో ఎలా ఎదగాలి అనే అంశంపై విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా యాదగిరిగుట్ట ప్రింట్ మీడియా యూనియన్ నేతలు హాజరయ్యారు. వారిని కళాశాల ప్రిన్సిపాల్, ప్రింట్ మీడియా యూనియన్ కోశాధికారి ఆరుట్ల కిషోర్ కుమార్ శాలువాలతో సత్కరించి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ప్రింట్ మీడియా యూనియన్ నేతలు ప్రిన్సిపాల్ కిషోర్ కుమార్ దంపతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపకను అందించారు. యాదగిరిగుట్ట ప్రింట్ మీడియా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కళ్లెం సంపత్, అధ్యక్షుడు బూడిద శ్రీహరి, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్.శేఖర్, ఉపాధ్యక్షుడు పుట్ట హనుమంత్, ప్రధాన కార్యదర్శి ఇండ్ల మచ్చేందర్, కోశాధికారి డంగు నరేందర్, ప్రచార కార్యదర్శి మొగిలిపాక కనకరాజు, సంయుక్త కార్యదర్శులు బి.అమర్నాథ్, కార్యవర్గ సభ్యులు శిఖ సాయికిషోర్, కర్రే గణేష్, ఓరుగంటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



