సరస్వతి పుష్కరాల భక్తుల్లో ఆనందం
కాళేశ్వరం, ప్రజాతంత్ర, మే 24 : సరస్వతి పుష్కరాలకు (Saraswathi Pushkaralu 2025) కాళేశ్వరం వొచ్చే భక్తుల రాకపోకలకు మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, కాళేశ్వరం బస్ స్టాండ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు, దేవాలయం పరిసరాల వరకు ఆర్టీసీ, సింగరేణి తదితర సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత షటిల్ బస్ సర్వీస్ సేవలు ఎంతో అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి వచ్చిన రజిత అనే భక్తురాలు మాట్లాడుతూ ఇలాంటి సేవలు ఏర్పాటు చేయడం వల్ల తాము సులభంగా సరస్వతి పుష్కర స్నానం ఆచరించి, కాళేశ్వర- ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నామన్నారు.
సిద్దిపేట మండలం, కుకునూరుపల్లి మండలం గ్రామం నుంచి వొచ్చిన. మల్లిశ్వరి మాట్లాడుతూ తాను, తన కూతురు ఇద్దరం ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా జీరో టికెట్ తో బస్ స్టాండ్ కు చేరుకున్నామని బస్ స్టాండ్ లో ఉచిత బస్ షటిల్ సర్వీస్ ద్వారా పుష్కర ఘాట్ , దేవాలయం వరకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సమస్య రాకుండా త్వరగా పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకున్నామని తెలిపారు. అలాగే పెద్దపల్లి నుంచి వచ్చిన కాంతమ్మ అనే భక్తురాలు మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం వల్ల సుదూర ప్రాంతం నుంచి కాళేశ్వరం వొచ్చామని, ఆర్థికంగా ఎలాంటి నగదు చెలించాల్సిన అవసరం లేకుండా పుష్కర స్నానం, స్వామి దర్శనం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మహాలక్ష్మి ద్వా రా ఉచిత ప్రయాణం అందించడంతో పాటు కాళేశ్వరం నుండి ఆర్టీసీ, సింగరేణి సంస్థ ఉచిత బస్సు సేవలు అందిచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.





