హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: మేడ్చల్ జిల్లా పోచారం పోలీసు స్టేషన్ పరిధి వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి నలుగురు సెంట్రింగ్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని నీలిమ హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలిసి కూలీల కుటుంబీకులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.
నిర్మాణంలోని స్లాబ్ కూలి నలుగురికి గాయాలు



