బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ‘ అగ్ర’ తాంబూలం..!

సుదీర్ఘకాలంగా పెండింగ్‌ ‌లో ఉన్న భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ .‌రాంచందర్‌ ‌రావు ఒక్కరే పత్రాలు దాఖలు చేయడం తో ఆయన ఎంపిక లాంఛనప్రాయమే అయింది.అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న పలువురిని కాదని అధిష్టానం కొత్తవ్యక్తిని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలను సోమవారం నిర్వహించాలని ఆదేశించిన బిజెపి అధిష్టానం, ఒక్కరుమాత్రమే నామినేషన్‌ ‌వేయాలని కూడా సూచించింది. ఆమేరకు ఆంధ్రలో పార్టీ సీనియర్‌నాయకుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్‌ ‌మాధవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటించింది. తెలంగాణ విషయానికొచ్చేటప్పటికీ చివరిదాకా టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. వాస్తవంగా తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవిని ఆశించినవారి జాబితా పెద్దదిగానే ఉంది. అనేక ఊహాగానాలు, సామాజిక వర్గాలను బేరీజువేసుకోవడం ద్వారా ఫలానా వారికే ఈసారి అధ్యక్షపదవి దక్కుతుందన్న చర్చలు జరిగాయి.ప్రధానంగా వినిపించిన పేర్లలో ఆపార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్‌, ‌డికె అరుణ, ఈటల రాజేందర్‌లతోపాటు బండి సంజయ్, డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌పేర్లు ప్రచారంలోకి వొచ్చాయి.
కాగా రఘనందన్‌రావు, రాజాసింగ్‌లు కూడా పోటీపడినవారిలో ఉన్నారు అయితే దేశంలో,రాష్ట్రంలో ఇటీవల కాలంలో ట్రేండింగ్‌ ‌లో ఉన్న మహిళా స్వావలంబన, వెనుక బడిన తరగతుల సంఖ్యను బట్టి వివిధ పదవుల్ల దాదాపు అన్ని రాజకీయపార్టీలు ప్రాధాన్యతను కలిపిస్తున్న విషయం తెలిసిందే. దానికి తగినట్లు బిజెపికూడా బీసీ నినాదం ఎత్తుకున్న దృష్ట్యా, అధ్యక్షుడిగా బిసీ వ్యక్తికి లేదా మహిళ కు అవకాశం లభిస్తుందనుకున్నారు. ఆ విధంగా ధర్మపురి అరవింద్‌తో పాటు ఈటల రాజేందర్‌, ‌డాక్టర్‌ ‌లక్ష్మణ్‌, ‌బండి సంజయ్‌కుమార్,డి కె అరుణ ‌ ‌పేర్లు ముందుకు వొచ్చాయి. బండి సంజయ్‌ ‌మొదట్లోనే తాను ఆపదవిని ఆశించడంలేదని స్పష్టంచేసిన విషయంతెలిసిందే. కాగా అధిష్టానం పలుసార్లు రాష్ట్రనాయకులతో కలిసి జల్లడపట్టి ఈటల రాజేందర్‌ ‌పేరును ఖరారు చేసినట్లు వార్తలు వొచ్చాయి. ఆదివారం రాత్రి ఆయనకు అధిష్టానం నుండి ఆమేరకు సమాచారం అందినట్లు తెలుస్తున్నది. దీంతో రాజేందర్‌ ‌ఖాయమనుకుంటున్నదశలో అనూహ్యంగా అధిష్టానం రామ్‌చందర్‌రావుపేరును తెరపైకి తీసుకువొచ్చింది.
ఒకపక్క రాష్ట్రంలో బిసీ నినాదం ప్రభలంగా, ఉన్నతరుణంలో బ్రాహ్మణుడైన రామ్‌చందర్‌రావును అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని పార్టీలోని పలువురు బిసీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి వీరవిధేయుడిగా, సౌమ్యుడిగా పేరున్న రామ్‌చందర్‌రావును సోమవారం నామినేషన్‌ ‌వేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. దానిపై ఆయన సోమవారం నామినేషన్‌ ‌దాఖలు చేసేవరకు కూడా ఉత్కంఠ నెలకొంది. ఆయన నామినేషన్‌ ‌వేస్తే తాము పోటీచేస్తామంటూ నిజామాబాద్‌ ఎం‌పి ధర్మపురిఅరవింద్‌, ‌గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌లు ప్రకటించడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే బిసీకే అధ్యక్షపదవివ్వటం సమంజసమని ఆరవింద్‌ అం‌టే, బూత్‌స్థాయి కార్యకర్తలనుంచి ఎంపిక ప్రక్రియ జరుపాలన్న తనవ్యక్తిగత అభిప్రాయాన్ని రాజాసింగ్‌ ‌వెల్లడించారు.
దానివల్ల పార్టీ అధ్యక్షుడు ఎదో ఒకగ్రూప్‌కు లేదా ఒకవ్యక్తికి సంబంధించిన వాడుగా ముద్రపడే అవకాశం ఉండదంటున్న ఆయన బిసీ వ్యక్తిగా తనను అధ్యక్షపదవికి ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిజెపిలో ఉండటంవల్ల తాను ఉగ్రవాదులకు టార్గెట్‌ అయ్యానని, ఇక మీ బిజెపికో దండం అంటూ, తనకిక పార్టీతో సంబంధంలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రామ్‌చందర్‌రావు ఎంపిక వెనుక ఆర్ఎస్ఎస్‌ ఆశిస్సులు ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ‌తర్వాత  కరుడుగట్టిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త గా రాం చందర్ రావు కు  పేరుంది.  2015లో పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఎన్నికైన రామ్‌చందర్‌రావు గతంలో పార్టీలో అనేకపదవులు చేపట్టిన వ్యక్తి. 1980-82 మధ్య భారతీయ జనతా యువమోర్చ రాష్ట్రకార్యదర్శిగా, 1999-2003 వరకు బిజెపి లీగల్‌సెల్‌ ‌జాయింట్‌ ‌కన్వీనర్‌గా,2003-2006 వరకు లీగల్‌ ‌సెల్‌ ‌కన్వీనర్‌గా,2007-2009 వరకు బిజెపి అధికార ప్రతినిధిగా పనిచేసిన రాంచందర్ రావు హైదారాబాద్‌ ‌బిజెపి అధ్యక్షుడిగా కూడా కొద్దికాలం పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *