రాష్ట్ర ఎమ్మెల్యేల పనితీరుపై…
పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సర్వే
తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్ కు చెందిన సంగారెడ్డి శాసనభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచారు.ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ పల్స్ సంస్థ- సౌత్ ఫస్ట్ వెబ్సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం 24 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది.
రాష్ట్రంలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురు పనితీరు బాగుందని, 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని, బీజేపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఒక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని, నలుగురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని, ఎంఐంఎం ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. సీపీఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే