యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాల వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కొండచుట్టు రెండున్నర కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేశారు. గిరి ప్రదక్షణ చేసిన అనంతరం కొండపైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యామ మల్లేష్  బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య , నాయకులు గడ్డమీది రవీందర్ గౌడ్, పస్పరి శంకరయ్య కసాబు శ్రీనివాస్ తుంగ బాలు ముక్కెర్ల సతీష్ తోటకూరి బీరయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *